శుక్రవారం 04 డిసెంబర్ 2020
Suryapet - Nov 20, 2020 , 01:10:00

పట్టణాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

పట్టణాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీష 

కోదాడ రూరల్‌ : పట్టణాభివృద్ధిలో పార్టీలకతీతంగా భాగస్వాములవ్వాలని కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ కోరారు. గురువారం పట్టణ పరిధి తమ్మరలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధిలో కోదాడ పట్టణాన్ని జిల్లాకు ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

రోడ్డు విస్తరణలో విగ్రహాలకు రక్షణ కల్పిస్తాం 

మఠంపల్లి : మండల కేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు వెంట ఉన్న నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశంలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జాల కిరణ్‌, వార్డుమెంబర్లు గాయం గోవర్ధన్‌రెడ్డి, వల్లపుదాసు సురేశ్‌, ఎంపీటీసీ గోలమారి ఆరోగ్యరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు దేవపంగు ప్రసాద్‌, కొమ్ము సైదులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.