శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Nov 20, 2020 , 00:54:36

ఎమ్మెల్సీ నియామకాల్లో సామాజిక న్యాయం

ఎమ్మెల్సీ నియామకాల్లో సామాజిక న్యాయం

సూర్యాపేట టౌన్‌ : ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నను ఎమ్మెల్సీగా నియమించడం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మాల మహానాడు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్‌, నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా రజక సామాజిక వర్గానికి చెందిన బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గవరపు దయానంద్‌ను నియమించి సమన్యాయం పాటించిన సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నంద్యాల దయాకర్‌రెడ్డి, ఉప్పల ఆనంద్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, మార్కెట్‌ డైరెక్టర్‌ ఊట్కూరి సైదులు, దాసరి దేవయ్య, బొల్లెద్దు వినయ్‌, తోట శ్యామ్‌, శంకరయ్య పాల్గొన్నారు.