బుధవారం 25 నవంబర్ 2020
Suryapet - Nov 19, 2020 , 03:29:08

సూర్యాపేటలో ఆరుగురు అరెస్టు

సూర్యాపేటలో ఆరుగురు అరెస్టు

బొడ్రాయిబజార్‌ : సూర్యాపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను, సహచరుడిని, ఒక విటుడిని, ముగ్గురు యువతులను  చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు. పట్టణంలోని విజయవాడ హైవే పక్కన ఉన్న ఓ హోటల్‌ వెనుక వైపు ఉన్న చెట్ల పొదల్లో కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించారు.  పట్టణానికి చెందిన మహిళలతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్ద నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకొని నిర్వాహకులను, విటుడితోపాటు మరో ముగ్గురు మహిళలను కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.  సూర్యాపేట సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.