మంగళవారం 01 డిసెంబర్ 2020
Suryapet - Nov 18, 2020 , 00:12:18

ఉమ్మడి జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ పరవళ్లు

ఉమ్మడి జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ పరవళ్లు

సూర్యాపేట జిల్లాలో పైకొచ్చిన భూగర్భజలాలు

అత్యధిక మండలాల్లో అడుగు లోతులోనే..

‘మెట్ట’లోనూ వరి సాగుకు మోగ్గు చూపిన రైతులు

80 శాతం పడిపోయిన కూరగాయల సాగు 

సూర్యాపేట  సూర్యాపేట జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. చేతబావుల్లో నీళ్లు ఇప్పుడు చేతికందేలా ఉన్నాయి.  బావులు, బోర్లల్లో నీరు ఉబికి వస్తున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సగటున 1.45 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి.  నుంచి 30 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండే తిరుమలగిరి మండలంలో ఇప్పుడు 0.00 అడుగుల లోతులో ఉన్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా  కృష్ణా పరీవాహక ప్రాంతమైన కోదాడ డివిజన్‌ కంటే ఇప్పుడు సూర్యాపేట డివిజన్‌ పరిధిలోనే భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. సూర్యాపేట జిల్లాలో సగటున 1.45 అడుగుల లోతులో ఉంటే.. కోదాడ డివిజన్‌లో 2.00 అడుగులు, సూర్యాపేట డివిజన్‌లో 1.13 అడుగుల లోతులో ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడంతోపాటు కాళేశ్వరం, మూసీ, కృష్ణా నీటితో భూగర్భ జలాలు ఈ స్థాయిలో పెరుగడానికి కారణమైంది. సూర్యాపేట జిల్లాలో 754.6 మి.మీ.  947.8 మి.మీ.  అంటే సాధారణం కంటే 26 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. 16 మండలాల్లో అత్యధికంగా వర్షాలు కురువగా..  మండలాల్లో సాధారణం, ఒక  లోటు వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు, మూసీ,  నీళ్లు పూర్తి స్థాయిలో రావడంతో చెరువులు నిండాయి. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా పైకి వచ్చాయి.  గ్రామాల్లో ‘జీరో’  లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 

చాలా ఏళ్ల తరువాత..

ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న 15 ఏండ్ల లెక్కల ప్రకారం ఈ స్థాయిలో భూగర్భ జలాలు పెరిగిన దాఖలాలు లేవు. సాధారణంగా వర్షాకాలం జిల్లాలో 5నుంచి 6 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉంటాయి. కానీ.. ఈసారి 1.45 అడుగుల లోతులో మాత్రమే ఉన్నాయి. గత అక్టోబర్‌లో జిల్లా వాప్తంగా 5.96 అడుగుల లోతులో  భూగర్భ జలాలు ఉన్నాయి.  సెప్టెంబర్‌లో 2.80 అడుగుల లోతులో ఉండగా.. ఒక నెలలోనే 1.35 అడుగులు పెరుగడం గమనార్హం.  

భూగర్భ జలాలు ఇలా..

సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో భూగర్భ జల వనరుల  సేకరించిన లెక్కల ప్రకారం అక్టోబర్‌ చివరి నాటికి భూగర్భ జలాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 0.00 అడుగులు ఉండగా, అనంతగిరి మండలంలో  అడుగులు, చిలుకూరులో 0.82, చింతలపాలెంలో 0.61, హుజూర్‌నగర్‌లో 0.73,  కోదాడలో 1.43, మఠంపల్లిలో 0.50, మేళ్లచెర్వులో 1.60, మునగాలలో 2.04, నడిగూడెంలో 1.96, ఆత్మకూర్‌(ఎస్‌)లో 0.40, చివ్వెంలలో 0.71, గరిడేపల్లిలో 1.31, జాజిరెడ్డిగూడెంలో 1.89, మద్దిరాలలో 0.68, మోతెలో 0.47, నాగారంలో 1.18, నేరేడుచర్లలో 2.05, నూతనకల్‌లో 0.68, పాలకవీడులో 1.72, పెన్‌పహాడ్‌లో 2.11, సూర్యాపేటలో 1.98, తుంగతుర్తి మండలంలో 0.74 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 


వరి వేసి బాధపడుతున్న..

 - ధరావత్‌ గోలి, పులితండా, చివ్వెంల మండలం 

నాకున్న ఎకరం భూమిలో చాలా సంవత్సరాలుగా టమాట, గోకర, బెండ సాగు చేస్తుంటిని. ఈసారి అందరూ నీళ్లున్నాయి.. వరి పంట వేయమన్నారు. వాళ్ల మాట నమ్మి వరి వేశా. కానీ..  ధరలు చూస్తే కూరగాయల సాగు ఎందుకు చేయలేదని బాధపడుతున్న. మంచి ధర ఉంది.. డబ్బులు మరిన్ని వచ్చు. నా చేనులో కూరగాయలు అమ్మేదిపోయి.. సూర్యాపేట మార్కెట్‌ నుంచి తెచ్చి అమ్ముతున్న. ఏ కూరగాయ ధర చూసినా రూ.40కు పైనే ఉంది. యాసంగి తప్పకుండా కూరగాయల సాగు చేస్తా. 


తగ్గిన  సాగు..

సూర్యాపేట జిల్లాలో ప్రతియేటా సగటున 3వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగయ్యేది.  ఏడాది  శాతం మేర  జిల్లాలో 639 ఎకరాల్లో మాత్రమే కూరగాయ పంటలు  దీంతో స్థానిక కూరగాయలు లేక ధరలు మండిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో సాగు కొంత మేర తగ్గింది. 2019 వానకాలం సీజన్‌లో  ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ సంవత్సరం  ఎకరాల్లో వేశారు.

జిల్లాలో రైతులు పండించే కూరగాయలకుతోడు  సంగారెడ్డి జిల్లాలతోపాటు విజయవాడ, గుంటూరు నుంచి కూరగాయలు వస్తుంటాయి.  అవి  ద్వారా జిలా  అందుతున్నాయి.  సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కూరగాయలు సాగయ్యేది  నియోజక  ఇక్కడ 1900 ఎకరాల వరకు కూరగాయ పంటలు సాగు చేస్తుంటారు. నియోజకవర్గం పరిధిలోని చివ్వెంల మండలంలో అత్యధికంగా  1500 ఎకరాల్లో సాగవుతుండగా..  చోట్ల కొంత మేర సాగు చేస్తున్నారు.  నియోజకవర్గంలో 150 ఎకరాలు, కోదాడ నియోజకవర్గంలో 528, తుంగతుర్తి నియోజకవర్గంలో 560 ఎకరాల్లో కూరగాయ పంటలు వేస్తుంటారు. కానీ..  ఏడాది  మొత్తం కలిపి 639 ఎకరాల్లో మాత్రమే కూరగాయల  చేశారు.  చివ్వెంల మండలంలో 135 ఎకరాల్లో సాగైంది. కూరగాయల్లో  155 ఎకరాలు, బెండ  మునగ 30.17, పచ్చిమిర్చి 157.05, ఆకుకూరలు 45, బీర  ఎకరాల్లో  మిగిలిన కూరగాయలు 20 ఎకరాల్లోపే సాగైంది. స్థానికంగా కూరగాయలు రాకపోవడంతో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే.. నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి పంట వేయడానికి మొగ్గు చూపారు. ఈ క్రమంలో కూరగాయల సాగు భారీగా తగ్గింది.