బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Nov 17, 2020 , 00:23:36

రైతులందరికీ టోకెన్లు అందజేస్తాం : ఆర్డీఓ

రైతులందరికీ టోకెన్లు అందజేస్తాం : ఆర్డీఓ

నేరేడుచర్ల : సన్నరకం ధాన్యం పండించిన రైతులందరూ తమ ధాన్యాన్ని మిల్లుల్లో విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్లు జారీ చేస్తున్నట్లు హుజూర్‌నగర్‌ ఆర్డీఓ వెంకారెడ్డి తెలిపారు. సోమవారం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో టోకెన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, సంయమనంతో క్యూ పద్ధతి పాటించి టోకెన్లు తీసుకోవాలన్నారు. ప్రతి రైతుకూ టోకెన్‌ ఇస్తామని, టోకెన్‌ తీసుకున్న తరువాత కోతలు మొదలుపెట్టాలన్నారు.  3ఎకరాలకు ఒక టోకెన్‌, 5ఎకరాలకు రెండు టోకెన్లు అందజేస్తామన్నారు. ఆయన వెంట తాసీల్దార్‌ రాంరెడ్డి, ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి ఉన్నారు.   

మఠంపల్లిలో టోకెన్ల పంపిణీ

మఠంపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో రైతులకు సోమవారం టోకెన్లు పంపిణీ చేసినట్లు ఏఓ బుంగా రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 500మంది రైతులకు టోకెన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈనెల 19 నుంచి 28వరకు రైతులు ధాన్యాన్ని మిర్యాలగూడెం మార్కెట్‌లో అమ్ముకోవచ్చని సూచించారు.