శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Nov 17, 2020 , 00:23:36

ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే

ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే

జాన్‌పహాడ్‌, నేరేడుచర్లలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం  

పాలకవీడు/ నేరేడుచర్ల : ధాన్యం అమ్మకాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌, నేరేడుచర్ల మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు  కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌   రైతు పక్షపాతి అని, రైతుల కోసం కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు, మద్దతు ధర పొందేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతులు సంయమనం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.  అనంతరం చిల్లేపల్లి వద్ద ధాన్యం అమ్మకానికి వెళ్తున్న రైతులతో ముచ్చటించారు. ధాన్యం అమ్మకాలపై ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  తాసీల్దార్లు కృష్ణానాయక్‌, రాంరెడ్డి, ఎంపీఓ మధు, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు మలమంటి దర్గారావు, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కడియం వెంకట్‌రెడ్డి, ఇంజమూరి యశోద, జడ్పీటీసీలు రాపోలు నర్సయ్య, మాలోతు బుజ్జీ, మున్సిపల్‌ చైర్మన్‌ జయబాబు, డీసీసీబీ డైరెక్టర్‌ అప్పిరెడ్డి, ఎంపీపీలు లకుమళ్ల జ్యోతి, భూక్యా గోపాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి,  మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు,  సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.  

గోదాం నిర్మాణానికి సిద్ధం : డీసీఓ 

కోదాడ రూరల్‌ : కోదాడ పీఏసీఎస్‌ పరిధిలోని గుడిబండలో 20గుంటల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే రూ.2కోట్ల సహకార నిధులతో 2వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోదామును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా సహకార సంఘం అధికారి ప్రసాద్‌ తెలిపారు. మండలంలోని గుడిబండ, కాపుగల్లు, కూచిపూడి గ్రామాల్లో సోమవారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.   ఏడీఏ వాసు,  ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బుర్ర సుధారాణి, పీఏసీఎస్‌ చైర్మన్లు ఆవుల రామారావు, నంబూరి సూర్యం, సర్పంచ్‌ కాసాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి 

నడిగూడెం/మఠంపల్లి : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవిత సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పీఏసీఎస్‌,  సిరిపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.  అలాగే మఠంపల్లి మండలకేంద్రంతోపాటు మండలంలోని పెదవీడు, వరదాపురంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్‌ రామచంద్రయ్య ప్రారంభించారు. రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, చైర్మన్‌ కొల్లు రామారావు, ఎంపీటీసీ జ్యోతి,   ఏఓ బుంగా రాజు, వైస్‌ చైర్మన్‌ బాణోతు బాబునాయక్‌, సర్పంచులు గడ్డం నాగలక్ష్మి, లక్ష్మీవీణ, బీబీ, బీక్యానాయక్‌, డైరెక్టర్లు,  సీఈఓ తదితరులు పాల్గొన్నారు.  

చిలుకూరు : మండలంలోని జెర్రిపోతులగూడెంలో బేతవోలు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య ప్రారంభించారు. సర్పంచ్‌ నలబోలు సుజాత, ఎంపీటీసీ మద్ది పద్మ పీఏసీఎస్‌ చైర్మన్‌ బాషం సైదులు, డైరెక్టర్లు మద్ది సుదర్శన్‌రెడ్డి, అనంతు ప్రమీల, నునావత్‌ శుక్లా, సీఈఓ పాషా, బడే సాహెబ్‌ పాల్గొన్నారు.