మంగళవారం 01 డిసెంబర్ 2020
Suryapet - Nov 16, 2020 , 01:48:58

ఆనందోత్సాహాలతో దీపావళి

ఆనందోత్సాహాలతో దీపావళి

పటాకులు కాల్చి సందడి చేసిన యువత 

హుజూర్‌నగర్‌/కోదాడ రూరల్‌ : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పండుగను హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల వ్యాప్తంగా శనివారం ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.  పండుగను పురస్కరించుకుని ఉదయం దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవీ వ్రతాలు చేశారు. సాయంత్రం లోగిళ్లలో దీపాలు వెలిగించారు.   అనంతరం పిల్లలు, పెద్దలు, యువత పెద్దఎత్తున పటాకులు కాల్చి సందడి చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు  తెలుపుకున్నారు. కోదాడ పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు ప్రమిదలు వెలిగించారు.  ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.