ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Nov 14, 2020 , 02:12:42

పత్తి టోకెన్ల విధానాన్నిపరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

పత్తి టోకెన్ల విధానాన్నిపరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల : పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకునేందుకు అధికారులు పంపిణీ చేస్తున్న టోకెన్ల విధానాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. శుక్రవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో టోకెన్ల కోసం వేచిఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. టోకెన్ల విధానం ఎలా ఉంది.. అని వారిని ప్రశ్నించడంతో చాలా బాగుందంటూ రైతులు సమాధానం చెప్పారు. అనంతరం మార్కెట్‌ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ఎమ్మెల్యే చిరుమర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌, మున్సిపల్‌ చైర్మన్లు జడల ఆదిమల్లయ్య, కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, తాసీల్దార్‌ కృష్ణారెడ్డి, ఏఓ గిరిబాబు, మార్కెట్‌ కార్యదర్శి జానయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే చిరుమర్తిని కలిసిన సీఐ..

కట్టంగూర్‌(నకిరేకల్‌) : నకిరేకల్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు శుక్రవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఐకి సూచించారు.