సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Nov 10, 2020 , 01:39:19

‘పేట’ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక

‘పేట’ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక

సూర్యాపేటఅర్బన్‌ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా ధాన్యం వ చ్చిం ది. సు మారు 30వేల బస్తాల ధాన్యం రావడంతో మార్కెట్‌ ప్రాంగణం   ధాన్యం రాశులతో నిండిపోయింది. అధిక ధాన్యం రాకతో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉం డేందుకు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లలితాఆనంద్‌ ధాన్యం రాశులను పరిశీలించారు.  రైతులు మా ర్కెట్‌ కు తీసుకొచ్చిన ధాన్యంలో వరి బీపీటీ 992 క్వింటాళ్లు, హెచ్‌ఎంటీ రకం 14,222 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌ 2218 క్వింటాళ్లు, ఐఆర్‌ 64రకం 1719 క్వింటాళ్లు  ఉన్నాయి.