ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Nov 10, 2020 , 01:39:17

సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

సూర్యాపేట తాసిల్దార్‌  వెంకన్న

సూర్యాపేట రూరల్‌  : ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌తో రైతులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ  సులభంగా మారి ందని సూర్యాపేట తాసిల్దార్‌ వెంకన్న అన్నారు. సోమవారం 10మంది రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకోగా 10మందికి భూమి రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాదార్‌ పాసుపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

అర్వపల్లిలో ఏడు రిజిస్ట్రేషన్లు                                    

అర్వపల్లి :   మండలకేంద్రంలో సోమవారం ఏడు గురి రైతుల భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. అనంతరం కొనుగోలు దారులకు  పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను అర్వపల్లి తాసిల్దార్‌  హరిశ్చంద్రప్రసాద్‌ అందజేశారు.  

తిరుమలగిరిలో నాలుగు..

తిరుమలగిరి : మండలకేంద్రంలో సోమవారం ధరణి పోర్టల్‌ ద్వారా నాలుగు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాసిల్దార్‌ సంతోష్‌కిరణ్‌ తెలిపారు. మండలంలోని జలాల్‌పురం గ్రామం నుంచి రెండు, గుండెపురి ఒకటి తిరుమలగిరి ఒకటి చొప్పు న రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి వారికి పట్టా మార్పిడి దస్తావేజులు అందజేశారు.    

మద్దిరాల మూడు..

మద్దిరాల : మండలంలో సోమవారం మూడు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తాసిల్దార్‌ రాంప్రసాద్‌ తెలిపారు. జి కొత్తపల్లి గ్రామానికి చెందినవి రెండు, ముకుందాపురం గ్రామంలో ఒక  రిజిస్ట్రేషన్‌ అయినట్లు చెప్పారు.  రిజిస్ట్రేషన్‌కు వచ్చే ముందు ఇద్దరు సాక్షులతో రావాలన్నారు.