సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Nov 10, 2020 , 01:39:17

ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుకోవాలి

ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుకోవాలి

 డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌  

అనంతారంలో పల్లె ప్రకృతి వనం పరిశీలన

పెన్‌పహాడ్‌ : రాష్ట్ర ప్రభు త్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని డీఆర్‌డీఓ సుం దరి కిరణ్‌కుమార్‌ సూచించారు. మం డల పరిధిలోని అనంతారంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం  సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కా ర్యక్రమంలో సర్ప ంచ్‌ బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యుడు జినకల నాగార్జున్‌, కార్యదర్శి రాజేశ్‌ పాల్గొన్నారు. 

పల్లె ప్రకృతివనంతో పచ్చదనం పెంపు  

అర్వపల్లి : పల్లె ప్రకృతివనాల ద్వారా పచ్చదనం పెంపొందుతుందని ఎంపీడీఓ ప్రభాకర్‌ అన్నారు. మండలంలోని కుంచమర్తి గ్రామంలో   పల్లె ప్రకృ తివనం స్థలాన్ని పరిశీలించి అనంతరం మొక్కలు నాటేందుకు మార్కింగ్‌ చేయించారు. కార్య క్రమంలో సర్పంచ్‌ ఉగ్గం ఉపేంద్ర, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ సయ్యద్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

 మొక్కలు నాటి సంరక్షించాలి

తుంగతుర్తి : పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీపీ గుండగాని కవిత అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపన్‌బాయితండాలోని పల్లె ప్రకృతి                            వనంలో మొక్కలు నాటారు.  కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ గుడిపాటి సైదులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పులుసు యాదగిరిగౌడ్‌, ఎంపీడీఓ లక్ష్మి, సర్పంచులు చందా వెంకన్న, శారద, నల్లు రాం చంద్రారెడ్డి, తాటికొండ సీతయ్య, ఏపీఓ వెంకన్న, ఏపీఎం ఆంజనేయులు  తదితరులు పాల్గొన్నారు.