సోమవారం 23 నవంబర్ 2020
Suryapet - Nov 09, 2020 , 01:49:05

కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధించాలి

కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధించాలి

ఉద్యానవన శాఖ అధికారి బి.శ్రీధర్‌  రైతులకు కూరగాయల నారు అందజేత

చివ్వెంల : మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పథకంలో భాగంగా రాయితీపై ఇస్తున్న కూరగాయల నారుతో అధిక దిగుబడులు సాధించాలని ఉద్యానవన శాఖ అధికారి బి.శ్రీధర్‌గౌడ్‌ సూచించారు. మండలంలోని వల్లభాపురం, లక్ష్మీనాయక్‌తండా, వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామాల రైతులకు ఆదివారం  కూరగాయల నారును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాడ్‌ జీడిమెట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో 25రోజుల పాటు అత్యాధునిక పద్ధతుల్లో పెంచిన టమాట, మిర్చి, వంకాయ నారు  ఉందన్నారు.  ఉన్న  స్థానిక ఉద్యానవన అధికారులను సంప్రదించాలని, అవసరమున్న వారికి నారు బుక్‌ చేస్తారని తెలిపారు.  ఎకరాకు    రూ.1500కు అందజేయనున్నట్లు తెలిపారు. కావాల్సిన రైతులు ఏడీహెచ్‌-సీఈఓ జీడిమెట్ల పేరుతో  తీసి,  పట్టాదారు పాస్‌పుస్తకం,  అకౌంట్‌ జిరాక్స్‌ పత్రాలను స్థానిక అధికారికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన డివిజన్‌ అధికారి కన్న జగన్‌, రైతులు పాల్గొన్నారు.