గురువారం 03 డిసెంబర్ 2020
Suryapet - Nov 06, 2020 , 01:22:49

ధరణితో రిజిస్ట్రేషన్లు సులభం

ధరణితో రిజిస్ట్రేషన్లు సులభం

ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ సులభమవుతుందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని రత్నతండాకు చెందిన సపావట్‌ అనిల్‌ చౌహాన్‌ గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోగా ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ గోపీరాం, ఎంపీపీసునీత, తాసిల్దార్‌ పుష్పలత పత్రాలు అందించారు.  

నిమిషాల్లోనే పనిపూర్తి

తాసిల్దార్‌ కార్యాలయంలో ఐదుగురు రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వీరు బుధవారం స్లాట్‌ బుక్‌ చేసుకోగా గురువారం తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తాసిల్దార్‌ భూ పత్రాలను పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. విక్రయ, కొనుగోలు దారులు, సాక్షుల సంతకాలతో పాటు వారి ఫొటోలు తీసుకోవడం, డిజిటల్‌ సంతకం చేయడం వంటి పనులు పూర్తి చేసి పత్రాలు లబ్ధిదారులకు అందించారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఆరు రిజిస్ట్రేషన్లు పూర్తి   

గుర్రంపోడు : ధరణి పోర్టల్‌లో గురువారం 6 రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు తాసిల్దార్‌ అంబటి ఆంజనేయులు తెలిపారు. నల్లగొండకు చెందిన షేక్‌ ఫాతిమా, మండలంలోని తెరాటిగూడేనికి చెందిన జక్కలి రమణ, లక్ష్మీదేవిగూడేనికి చెందిన నాగులవంచ శంకర్‌రావు, ఆములూర్‌కు చెందిన మేకల యాద య్య, తెనేపల్లి గ్రామానికి చెందిన బండా రు లక్ష్మమ్మ, వడిత్య ధోలి తాము కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోగా ప్రక్రియను పూర్తి చేసి పత్రాలు అందించినట్లు తెలిపారు.   

మిర్యాలగూడ రూరల్‌ : మండలంలోని తుంగపహాడ్‌కు చెందిన సంపంగి యాదమ్మ సూదిని అప్పిరెడ్డి వద్ద  37 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంది. గురువారం ఆమె తాసిల్దార్‌ కార్యాలయానికి రాగా తాసిల్దార్‌ గణేశ్‌ నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి కొనుగోలు దారులకు పత్రాలు అందించారు.  

దామరచర్ల : తాసిల్దార్‌ కార్యాలయంలో గురువారం రెండు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. దామరచర్లకు చెందిన షేక్‌ సుల్తానాబేగం మిర్యాలగూడకు చెందిన ఇందిరకు 14 గుంటలు, బొర్రాయిపాలెం గ్రామస్తులకు మరో 18 గుంటలు విక్రయించగా రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు వారంతా తాసిల్దార్‌ కార్యాలయానికి చేరుకోగా తాసిల్దార్‌ రాజు 10 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి పత్రాలు అందించారు.