ఆదివారం 06 డిసెంబర్ 2020
Suryapet - Nov 05, 2020 , 02:51:23

‘ధరణి’తో భూ అక్రమాలకు అడ్డుకట్ట

‘ధరణి’తో భూ అక్రమాలకు అడ్డుకట్ట

సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్‌

సూర్యాపేట రూరల్‌ : ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా భూ సంబంధిత అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, తాసిల్దార్‌ వెంకన్న అన్నారు. తాసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం  పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు పట్టదారు  అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ విధానం వల్ల భూముల క్రయ, విక్రయాల్లో పారదర్శకత పెరిగి భూ లావాదేవీలు సులభంగా జరుగుతాయన్నారు. వీలైన  స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, బుక్‌ చేసుకున్న సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే అరగంటలో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందని చెప్పారు.  ప్రక్రియ ద్వారా దళారుల బెడద ఉండదని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభంగా జరుగుతుందని అన్నారు. బుధవారం ఇద్దరు  బుక్‌ చేసుకోగా..  రిజిస్ట్రేషన్‌ చేసి పాసుపుస్తకం అందజేశామని చెప్పారు.  స్లాట్‌ బుక్‌ చేసుకొని కార్యాలయానికి హాజరు కాలేదని తెలిపారు.  

తిరుమలగిరిలో రిజిస్ట్రేషన్లు షురూ.. 

తిరుమలగిరి :   మొదటి రిజిస్ట్రేషన్‌ పండుగ వాతావరణంలో జరిగింది.  రిజిస్ట్రేషన్‌ అయిపోవడంతో రైతులు ఆనందం పట్టలేక స్వీట్లు తెచ్చి   పాస్‌పుస్తకం  డాక్యుమెంట్లు అందజేశారు.  పాస్‌పుస్తకం వారం రోజుల్లో ఇంటికి పంపించనున్నట్లు తాసిల్దార్‌ సంతోష్‌కిరణ్‌ తెలిపారు.

ధరణి సేవలు ప్రారంభం 

ఆత్మకూర్‌(ఎస్‌) : మండలంలో ధరణి రిజిస్ట్రేషన్‌ సేవలు పారంభమయ్యాయి.  మజీద్‌అలీ   మంగళవారం స్లాట్‌ బుక్‌ చేసుకోగా.. సాంకేతిక లోపం కారణంగా రిజిస్ట్రేషన్‌ ఆగిపోయింది. బుధవారం 30నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి డాక్యుమెంట్లు అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ లింగస్వామి పాల్గొన్నారు. 

మద్దిరాలలో 4 

మద్దిరాల : తాసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి.  గ్రామానికి  ఇద్దరు, పోలుమళ్ల, గుమ్మడవెల్లి గ్రామాలకు చెందిన ఒక్కొక్కరు  భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  ఆన్‌లైన్‌ పట్టాదారు పాసుబుక్‌ పత్రాలను తాసిల్దార్‌ రాంప్రసాద్‌ అందజేశారు. ధరణి వల్ల తమకు తిరిగే బాధలు తప్పాయని వారు పేర్కొన్నారు. 

20 నిమిషాల్లోనే పూర్తి.. 

చివ్వెంల : మండలంలో బుధవారం మూడు స్లాట్లు బుకింగ్‌ కాగా..  తాసిల్దార్‌  రిజిస్ట్రేషన్లు  చేశారు.  తాసిల్దార్‌ పి.సైదులు సెలవులో ఉండడంతో పెన్‌పహాడ్‌ తాసిల్దార్‌ శేషగిరిరావు అక్కడ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని సాయంత్రం 4గంటలకు  వచ్చారు.   రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను సిద్ధం చేసి ఉంచడంతో  నిమిషాల్లోనే పని    పాస్‌  అందజేశారు.

అర్వపల్లిలో ఐదు..

అర్వపల్లి : మండలంలో  పోర్టల్‌ ద్వారా  రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తాసిల్దార్‌ గోలి హరిశ్చంద్రప్రసాద్‌ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బత్తుల వనజ, బత్తుల వెంకటేశ్వర్లు మంగళవారం  బుక్‌ చేసుకోగా బుధవారం రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు   గ్రామానికి చెందిన కాటబోయిన వెంకన్న, తిమ్మాపురం గ్రామానికి చెందిన బొడ్డు స్వరూప,  భానుచందర్‌ కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు  తాసిల్దార్‌ తెలిపారు.