గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Nov 04, 2020 , 01:19:00

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే నోముల

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే నోముల

  • పలు అంశాలపై వినతిపత్రం అందజేత

హాలియా : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. ఇటీవల కురిసిన వర్షానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల కోసం రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, సాగర్‌లో ఖాళీగా ఉన్న చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయాన్ని, బీఈడీ కళాశాల భవనాన్ని మరమ్మతు చేయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు వినియోగించాలని కోరారు. హాలియాలో సర్వేనెంబర్‌ 147లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నందున, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు కేటాయించాలని కోరారు. అనుముల వద్దగల మూడెకరాల వ్యవసాయ కళాక్షేత్రంలోని భవనం, స్థలాన్ని వ్యవసాయ లేదా మున్సిపల్‌ శాఖలకు అప్పగించాలని కోరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌ ఉన్నారు.