శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Nov 04, 2020 , 01:19:00

సాగర్‌@ 590 అడుగులు

సాగర్‌@ 590 అడుగులు

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు) అడుగులకు మంగళవారం 589.50 అడుగుల వద్ద 310.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం కుడికాల్వ ద్వారా 10567 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8807, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25010, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా వరదకాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 45584 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా అంతే అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు  884.90 (215.32 టీఎంసీలు) వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 36701 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.