మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Nov 03, 2020 , 00:59:29

ధరణితో భూ అక్రమాలకు అడ్డుకట్ట

ధరణితో భూ అక్రమాలకు అడ్డుకట్ట

  •  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
  •   జిల్లాలో 7 స్లాట్‌ బుకింగ్‌, 4 రిజిస్ట్రేషన్లు పూర్తి

సూర్యాపేట రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ ద్వారా భూ సంబంధిత అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ విధానం వల్ల భూసంబంధ క్రయ విక్రయాల్లో పారదర్శకత పెరిగి లావాదేవీలు సులభంగా జరుగుతాయన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అనుకూలమైన తేదీల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో 7స్లాట్‌ బుక్‌ కాగా 4 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, తాసిల్దార్‌ వెంకన్న, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

31న స్లాట్‌ బుక్‌.. 2న రిజిస్ట్రేషన్‌ ..

పెద్దవూర : తాసిల్దార్‌ . కార్యాలయంలో సోమవారం ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తాసిల్దార్‌ సైదులుగౌడ్‌ ప్రారంభించారు. అక్టోబర్‌ 31న స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఉదయం కొంతసేపు కంప్యూటర్లు మొరాయించిన అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులువుగానే అయ్యిందని తాసిల్దార్‌ తెలిపారు.