సోమవారం 23 నవంబర్ 2020
Suryapet - Nov 01, 2020 , 01:41:12

భావితరాలకు స్ఫూర్తి వాల్మీకి

భావితరాలకు స్ఫూర్తి వాల్మీకి

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట : భావితరాలకు స్ఫూర్తి వాల్మీకి మహర్షి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శనివారం వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహర్షి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. అడవుల్లో పెరిగి మహారుషిగా ఎదిగిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

వాల్మీకి జీవితం ఆదర్శనీయం  : అదనపు కలెక్టర్‌ 

నల్లగొండ : వాల్మీకి జీవితం ఆదర్శనీయమని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌  సమావేశ మందిరంలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి  నివాళర్పించారు.  జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, ఏఓ మోతీలాల్‌, సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు.