శుక్రవారం 04 డిసెంబర్ 2020
Suryapet - Nov 01, 2020 , 01:36:56

కుల వివక్షను అంతమొందించాలి

కుల వివక్షను అంతమొందించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ

హుజూర్‌నగర్‌ : గ్రామీణప్రాంతాల్లో కుల వివక్షను అంతమొందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని గోవిందాపురంలో జరిగిన సివిల్‌ రైట్స్‌ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కుల వివక్షను రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నా కొంతమంది అవరోధంగా ఉన్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు కరెంటును 101యూనిట్ల కంటే తక్కువగా వినియోగిస్తే బిల్లు లేదని ప్రభుత్వం జీవో తెచ్చినా అధికారులు వాటిని వివరించకపోవడం వల్ల ప్రతిఫలం దక్కడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, ఎస్టీల పేర్ల మీద ట్రాక్టర్లను మంజూరు చేస్తే, వాటిని మరెవరో అనుభవిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, ఆర్డీఓ వెంకారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గెల్లి అర్చన, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, డీఎస్పీ రఘు, కౌన్సిలర్‌ చిలకబత్తిన సౌజన్య, బొల్లెద్దు ధనమ్మ, దయానందరాణి, శిరీష, లత పాల్గొన్నారు.