శుక్రవారం 04 డిసెంబర్ 2020
Suryapet - Oct 31, 2020 , 02:42:45

వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలి

వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలి

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య   

కొలువుదీరిన మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం 

కోదాడ రూరల్‌ : వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఉంటూ నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించాలన్నారు. పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే, నూతన చైర్‌పర్సన్‌ బుర్ర సంధ్యారాణీపుల్లారెడ్డి పటాకులు కాలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. నాగార్జున సెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా మార్కెట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకారం చేసి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సంపెట ఉపేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష, ఎంపీపీ చింతా కవితారెడ్డి, పాలకవర్గ సభ్యులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ 

శ్రేణుల బైక్‌ర్యాలీ 

అనంతగిరి/నడిగూడెం : కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి శుక్రవారం అనంతగిరి, నడిగూడెం మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. అనంతగిరి టీఆర్‌ఎప్‌ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్‌, నడిగూడెం సర్పంచ్‌ నాలగలక్ష్మీమల్లేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, జై కేసీఆర్‌ నినాదాలతో కోదాడ తరలివెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కాసాని పుల్లయ్య, బోనగిరి ఉపేందర్‌, వెంకన్న, వెంకటేశ్‌, డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, జలీల్‌, సతీశ్‌ పాల్గొన్నారు. 

వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌కు సన్మానం 

మోతె : కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌గౌడ్‌ను శుక్రవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుండాల గంగులు, టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు.