శుక్రవారం 04 డిసెంబర్ 2020
Suryapet - Oct 31, 2020 , 02:42:45

అందుబాటులోకి వస్తున్న రైతు వేదికలు

అందుబాటులోకి వస్తున్న రైతు వేదికలు

ఆకర్షణీయ రంగులు, డిజైన్లతో రూపకల్పన

పచ్చని చెట్లు, పూల మొక్కలతో ముస్తాబు 

రైతన్నలను సంఘటితం చేసి, నూతన సాగు విధానాన్ని ప్రోత్సహిస్తూ, అధిక పంటల ఉత్పత్తులు సాధించడంతోపాటు మార్కెట్‌ సౌకర్యం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. విశాలమైన స్థలంలో రంగురంగుల డిజైన్లతో భవన నిర్మాణం పూర్తి కాగా పచ్చని చెట్లు, పూల మొక్కలతో ఆకర్షించే ఆవరణాన్ని ఏర్పాటు చేశారు. సకల హంగులతో పూర్తయిన రైతు వేదికలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి నిర్మాణానికి దాతలు స్థలాలు విరాళం ఇవ్వడంతోపాటు వాటి నిర్మాణానికి సైతం ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో ఈ వేదికలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.