శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 31, 2020 , 02:42:45

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

   నేడు సూర్యాపేట మార్కెట్‌ కమిటీ   ప్రమాణ స్వీకారం

   హాజరు కానున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నేడు కొలువు దీరనున్నది.   లలిత రూపమాణ స్వీకారం చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరు కానున్నారు. చైర్‌పర్సన్‌తోపాటు  చైర్మన్‌ ముద్దం కృష్ణారెడ్డి,  దాచేపల్లి భరత్‌, మహ్మద్‌ సల్మా, ఊట్కూరి సైదులు, పగిళ్ల శేఖర్‌, శంకరమద్ది రమణారెడ్డి, బానోతు గంగరాజు, బోనాల రవీందర్‌, ముప్పారపు నాగేశ్వర్‌రావు  స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ నాయకులు యలగందుల వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌, ఉప్పల ఆనంద్‌, కోడి సైదులు పరిశీలించారు. 

మొదటి మహిళా చైర్‌పర్సన్‌

సూర్యాపేట మార్కెట్‌కు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది. మార్కెట్‌ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పురుషులు మాత్రమే చైర్మన్‌  చేపట్టారు.  మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో మహిళ  చేపట్టబోతున్నారు.  పాలకవర్గం  కొనసాగనున్నది.