మంగళవారం 01 డిసెంబర్ 2020
Suryapet - Oct 28, 2020 , 00:21:57

సాగర్‌ నాలుగు క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్‌ నాలుగు క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

  నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వస్తున్న వరద ఉధృతి ఆధారంగా డ్యాం క్రస్టుగేట్ల ద్వారా  నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు)అడుగులకు మంగళవారం 589.00 అడుగుల వద్ద (311.7462 టీఎంసీలు)నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 75,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా అదేస్థాయిలో అవుట్‌ఫ్లోను కొనసాగిస్తున్నారు. నాలుగు క్రస్టుగేట్ల ద్వారా 32,360 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 8,604, ఎడమ కాల్వ ద్వారా 7,601, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25,131 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885(215.8070 టీఎంసీలు) అడుగులకు 884.90(215.3263 టీఎంసీలు)అడుగులు నిల్వ ఉంది.   

పులిచింతల@174.867అడుగులు 

చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175.00(45.77 టీఎంసీలు)అడుగులకు  మంగళవారం 174.867(45.5647 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 45,268 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 35,268 క్యూసెక్కులు, విద్యుత్‌ కేంద్రం నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.