గురువారం 03 డిసెంబర్ 2020
Suryapet - Oct 28, 2020 , 00:21:57

పోలీస్‌ వృత్తి బాధ్యతతోపాటు భరోసానిస్తుంది

పోలీస్‌ వృత్తి బాధ్యతతోపాటు భరోసానిస్తుంది

డీఐజీ, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ 

నల్లగొండక్రైం : పోలీస్‌ వృత్తి బాధ్యతతోపాటు భరోసానిస్తుందని డీఐజీ, నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఫ్లాగ్‌డేలో భాగంగా మంగళవారం నల్లగొండ పోలీస్‌ కార్యాలయంలో  రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని  ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అమరులైన పోలీసులను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థంగానే ఫ్ల్లాగ్‌డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంఘవిద్రోహుల చేతిలో బలైన అమర పోలీసులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి పోలీస్‌ తన వృత్తికి  వన్నె తెచ్చేలా విధులు నిర్వహించాలని సూచించారు.  అదనపు ఎస్పీ నర్మద, ఏఆర్‌ డీఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐలు వైవీ ప్రతాప్‌, సర్పరాజ్‌, నర్సింహ, ట్రాఫిక్‌ సీఐ దుబ్బ అనిల్‌, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి గోలి అమరేందర్‌రెడ్డి, డాక్టర్‌ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.