ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Oct 28, 2020 , 00:21:58

భూమి అక్రమ పట్టా..

భూమి అక్రమ పట్టా..

రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ, రెవెన్యూ 

అధికారులపై కేసు నమోదు

మద్దిరాల : మండలంలోని కుంటపల్లిలో వ్యవసాయ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ, సహకరించిన తుంగతుర్తి, మద్దిరాల రెవెన్యూ అధికారులపై తుంగతుర్తి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదు చేసినట్లు  సాయిప్రశాంత్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కుంటపల్లి గ్రామానికి చెందిన కోతి బుచ్చిరెడ్డి, బుచ్చమ్మ దంపతులకు సత్యనారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి   బుచ్చమ్మకు కుంటపల్లి రెవెన్యూ పరిధిలోని 83, 94/ఏ, 98/ఈ/2, 102/ఏ సర్వే నెంబర్లలో ఏడు ఎకరాల 18   ఉంది. వారసత్వంగా  సదరు  సత్యనారాయణరెడ్డికి తెలియకుండా తమ్ముడైన రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సుదర్శన్‌రెడ్డి 2010 సంవత్సరంలో అక్రమంగా పట్టా చేసుకున్నాడు. ఇందుకు గతంలో  పనిచేసిన సైదులు, తాసిల్దార్‌ డేవిడ్‌రాజు, ప్రస్తుత వీఆర్వో  ప్రస్తుత మద్దిరాల తాసిల్దార్‌ రాంప్రసాద్‌ సహకరించారు. దీంతో సత్యనారాయణరెడ్డి తుంగతుర్తి ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం కోతి సుదర్శన్‌రెడ్డి, వీఆర్వోలు  నర్సయ్య, తాసిల్దార్లు డేవిడ్‌రాజు, రాంప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.