సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Oct 28, 2020 , 00:22:30

ఫిర్యాదుల సంఖ్య పెరిగింది..

ఫిర్యాదుల సంఖ్య పెరిగింది..

సూర్యాపేట  : జిల్లాలో ఫిర్యాదుల సంఖ్య బాగా పెరిగిందని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి ప్రజలకు సేవలు అందిస్తున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులతో  సమావేశం  ఈ సందర్భంగా ష్‌ఫెండ్లీ పోలీసింగ్‌ అమలు, కేసుల దర్యాప్తు, తీవ్ర నేరాల పర్యవేక్షణ కోర్‌ మానిటరింగ్‌, పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం తదితర అంశాలపై డీజీపీ చర్చించి సలహాలు అందించారు. ఎస్పీ భాస్కరన్‌ మాట్లాడుతూ తీవ్ర నేరాల పర్యవేక్షణకు జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక గురించి డీజీపీకి వివరించారు. పోలీసు శాఖపై ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఉన్నారని,   సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కోదాడ డీఎస్పీ రఘు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.