శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 25, 2020 , 02:15:40

కలల పండుగ.. కాంతులే నిండుగా

కలల పండుగ.. కాంతులే నిండుగా

  • ఊరూరా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

వాకిళ్లన్నీ రంగు రంగుల పూలతో విరబూయగా.. ఆడబిడ్డల మోములో కాంతులు నిండాయి.  తీరొక్క పూలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సద్దుల బతుకమ్మ వేడకలు ఘనంగా ముగిశాయి.  బతుకమ్మలను అందంగా పేర్చి సాయంత్రం వేళ కూడళ్లలో ఉంచి ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము గడిచె చందమామ’ అంటూ మహిళలు ఆడిపాడారు. ఆ తరువాత నీటిలో నిమజ్జనం చేసి ‘పోయిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు.