శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 25, 2020 , 02:15:38

సాగర్‌ 10 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్‌ 10 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో పది క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1,90,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో అదేస్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగిస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం 589.50అడుగులు(310.5510 టీఎంసీలు) నిల్వ ఉంది. ప్రాజెక్టు క్రస్టు గేట్ల ద్వారా 1,46,140 క్యూసెక్కులు,  కుడికాల్వ ద్వారా 8680, ఎడమ కాల్వ ద్వారా 6325, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25172, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా వరద కాల్వ ద్వారా  నీటి విడుదల లేదు. శ్రీశైలంకు 2,11,641 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 

పులిచింతల@174.50 అడుగులు

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు 174.50(45 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,03,803 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు 8గేట్ల ద్వారా 1,67,285, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి 8వేలు మొత్తం 1,75,285 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7వేల 752క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 5 వేల 105 క్యూసెక్కులు దిగువకు వదులుతుండగా, 39క్యూసెక్కులు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు(4.46 టీఎంసీలు) ప్రస్తుతం 643.10 అడుగులు(3.97 టీఎంసీలు) ఉంది.