మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Oct 25, 2020 , 02:16:13

టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదల

టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదల

నల్లగొండ విద్యావిభాగం : టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నల్లగొండలోని ప్రగతి జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. నంద్యాల దయాకర్‌రెడ్డి 451వ ర్యాంకు, బైరు దివ్య 1454వ ర్యాంకు, మాదగోని రాకేశ్‌ 2208వ ర్యాంకు సాధించారు. వీరికి కళాశాల డైరెక్టర్లు శశిధర్‌రావు, చందా శ్రీనివాస్‌, పైళ్ల రమేశ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నల్లగొండ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సామాల ప్రవళిక 275వ ర్యాంకు సాధించింది.