మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Oct 24, 2020 , 00:37:19

దివ్య రూపం చూడతరమా..

దివ్య రూపం చూడతరమా..

  • కొనసాగుతున్న దేవీ శరన్న వరాత్రి ఉత్సవాలు
  •  వైభవంగా లక్ష కుంకుమార్చనల పూజలు

అన్నపురెడ్డిపల్లి:మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. శుక్రవారం ఆలయంలో అమ్మవారు శ్రీవిజయలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో పురోహితులు గిరిధరా చార్యులు, ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  అదే విధంగా మండలంలోని భవానీ నగర్‌, ఎర్రగుంట శ్రీకోదండ రామాలయంలో అమ్మవారు శ్రీలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు.   

 దుర్గాదేవి అవతారంలో ..

అశ్వారావుపేట టౌన్‌: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధ్దలతో జరుగుతున్నాయి. శుక్రవారం పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు శ్రీ దుర్గామాత అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన పూజా వేడుకలను నిర్వహించిన అనంతరం 365 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు చేపట్టారు. 108 మంది మహిళలతో పరిమళ సుగంధాభిశేఖం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటి అధ్యక్షుడు ముత్తా సుమాకర్‌ పూజా వేడుకలను పర్యవేక్షించారు. 

శ్రీమహాలక్ష్మి అవతారంలో  

దమ్మపేట: మండల పరిధిలోని గణేష్‌పాడులోని శ్రీవిజయదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు గురువారం అమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా అలంకరించారు. ఆ అవతారంలో ఉన్న అమ్మవారికి కరెన్సీ మాలను అలంకరించగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు సింహాద్రి నాగేశ్వరరావు, వేదపండితులు కేతముక్కల పవన్‌శర్మ, అనిరుద్‌, సాయిరామశర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయనిర్మాణ దాతలు, మందలపల్లి ఉపసర్పంచ్‌ గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతుల ఆధ్వర్యంలో భవానీదీక్షాపరులు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీగాయత్రి ఆశ్రమంలో కొలువైన అమ్మవారు శ్రీమహాలక్ష్మి అలంకారంలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు.