శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 24, 2020 , 00:37:15

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు

బొడ్రాయిబజార్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో  అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నది.   శుక్రవారం మహాలక్ష్మి   ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని  దేవాలయంలో  ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించారు. చండీహోమం, రుద్రహోమం,  వ్రతం, గాజుల పూజ  ఒడి బియ్యం పోశారు. చిన్నారులు దేవత వేషధారణ పోటీల్లో పాల్గొనగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. రాత్రి అమ్మవారికి పవళింపు సేవ నిర్వహించారు.  అమ్మవారు నేడు దుర్గాదేవిగా  దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్లపల్లి మురళీధర్‌ తెలిపారు. 

నాగారం :  గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని  అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంజయ్య, సోమరాజు, బద్రి, లింగమల్లు, మల్లేశ్‌, స్వామి, రామస్వామి  

 తిరుమలగిరి :  కేంద్రంలో దుర్గామాత  మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు దీపాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు.

  పెన్‌పహాడ్‌ : మండలంలోని చీదెళ్ల, మహ్మదాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గ మండపాల వద్ద అన్నదానం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు శనగాని రాంబాబు కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు పరెడ్డి సీతారాంరెడ్డి, కొండేటి రజిని, సుధాకర్‌, ఎంపీటీసీ కొండేటి పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

చివ్వెంల : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని  అన్నదానం చేశారు. అంతకుముందు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పూజలు  కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ బాషా, నాయకులు