ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Oct 21, 2020 , 01:57:32

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌పైనే విశ్వాసం

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌పైనే విశ్వాసం

  • రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
  • పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యం
  • టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా ముందుకు సాగాలి
  • బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల అబద్ధాలను తిప్పికొడుదాం..
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • మిర్యాలగూడ, హాలియాలో ‘పట్టభద్రుల’ సన్నాహక సమావేశం

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. అందుకే ఏ ఎన్నికలొచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొడుదామని.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాలగూడ, హాలియాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భారీ మెజార్టీయే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మ్మెల్యేలు భాస్కర్‌రావు, నోముల, తదితరులు పాల్గొన్నారు. 

మిర్యాలగూడ/హాలియా : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అందుకే రాష్ట్రలో ఏ ఎన్నికలొచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొడుదామని..  వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.  మంగళవారం మిర్యాలగూడ, హాలియాలో వేర్వేరుగా నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఓటరు నమోదు అవగాహన సదస్సులకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమేనని, దీనిని పార్టీ శ్రేణులు చాలెంజ్‌గా తీసుకొని పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపుకోసం అహర్నిషలు కృషిచేయాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే కాకుండా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్‌, వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు ఇలా చెప్పుకుంటూపోతే 50కిపైగా సంక్షేమ పథకాలుఅమలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో గానీ, దేశానికి ఎంతోమంది ప్రధానులను అందించిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోగానీ ఈ సంక్షేమ పథకాల ఊసేలేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముమ్మరం చేయాలని సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 60వేల పార్టీ సభ్యత్వాలు ఉన్నాయని, ఈ సభ్యుల కుటుంబాల్లో ఉన్న ప్రతి పట్టభద్రుని ఓటు నమోదు చేయించే బాధ్యత ప్రతి సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌పై ఉందన్నారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాధ్యతతో పనిచేయకుండా పార్టీకి నమ్మకద్రోహం చేయొద్దని సూచించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు సోషల్‌మీడియాలో పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా యాభైవేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఐటీ రంగం అభివృద్ధితో మరో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిందని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 5.5లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 5కోట్ల ఉద్యోగాలు ఊడబీకారన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నిక లేవైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు  భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థిని నిలిపినా గెలుపుకోసం కార్యకర్తలు అహర్నిషలు కృషి చేయాలన్నారు. 

ఆయా సమావేశాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రామచందర్‌నాయక్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఇరిగి పెద్దులు, మున్సిపల్‌ చైర్మన్లు తిరునగరు భార్గవ్‌, వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు తిప్పన విజయసింహారెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీలు జయమ్మ, అంగోతు భగవాన్‌నాయక్‌, నోముల భగత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కామర్ల జానయ్య, యడవల్లి నీలిమామహేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, ఇరిగినేని అంజయ్య, మర్ల చంద్రారెడ్డి, కుర్ర కోటేశ్వర్‌రావు, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, బాబయ్య, చిర్ర మల్లయ్యయాదవ్‌, నారాయణరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పాశం నర్సింహారెడ్డి, నాగార్జునచారి, స్కైలాబ్‌నాయక్‌, చిట్టిబాబునాయక్‌, షోయబ్‌, కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.