సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Oct 21, 2020 , 01:57:32

వ్యవసాయ మార్కెట్లకు కమిటీల నియామకం

వ్యవసాయ మార్కెట్లకు కమిటీల నియామకం

సూర్యాపేట అర్బన్‌/కోదాడ/హుజూర్‌నగర్‌/నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లకు కమిటీలను నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సెక్రటరీ బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల లలితాదేవి, వైస్‌ చైర్మన్‌గా ముద్దం కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డైరెక్టర్లుగా దాచేపల్లి భరత్‌, మహ్మద్‌ సల్మా, ఊట్కూరి సైదులు, పగిళ్ల శేఖర్‌, సంకరమద్ది రమణారెడ్డి, బాణోతు గంగరాజు, బోనాల రవీందర్‌, ముప్పారపు నాగేశ్వర్‌రావు నియమితులయ్యారు. నూతనంగా నియామకమైన సభ్యులు ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి సంవత్సరంపాటు పదవిలో కొనసాగనున్నారు. నూతన చైర్మన్‌గా నియామకమైన లలితాదేవి టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఉప్పల ఆనంద్‌ సతీమణి. వైస్‌ చైర్మన్‌గా నియామకమైన కృష్ణారెడ్డి కందగట్ల గ్రామ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పని చేశారు.

అలాగే కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లతోపాటు 12మంది డైరెక్టర్లను నియమించారు. చైర్‌పర్సన్‌గా  అనంతగిరి మండలం లక్కవరం గ్రామానికి చెందిన బుర్రా సుధారాణి, వైస్‌ చైర్మన్‌గా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ గ్రామానికి చెందిన సంపెట ఉపేందర్‌ను నియమించగా, డైరెక్టర్లుగా దండ వీరభద్రం, ధరావత్‌ నాగేశ్వర్‌రావు, చెవుల నాగేశ్వర్‌రావు, మేకల శ్రీనివాసరావు, ఆలేటి సత్యనారాయణ, యలమర్తి దశరథరామిరెడ్డి, కన్నెబోయిన శ్రీనివాసరావు, ఓరుగంటి వెంకటభద్రం, అనంతగిరి మండలంలోని ఖానాపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ జొన్నలగడ్డ హన్మయ్య, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సంతోష్‌కుమార్‌, కోదాడ ఏడీఏ వాసు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషను నియమించారు. హుజూర్‌నగర్‌ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా కడియం వెంకట్‌రెడ్డి,  గువ్వల వీరయ్యను వైస్‌చైర్మన్‌గా నియమించారు. కమిటీ మెంబర్లుగా పోలె శంభయ్య, అన్నెం శంభిరెడ్డి, గుజ్జుల నర్సిరెడ్డి, మోదాల

నర్సిరెడ్డి, మోదాల నాగయ్య, మాలోతు భక్ష్యానాయక్‌, దేవనమం పద్మ, గుండా రామనాగేశ్వర్‌రావు, మతిన్‌ను నియమించారు. నేరేడుచర్ల  మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇంజమూరి యశోద, వైస్‌చైర్మన్‌గా కావూరి వెంకటేశ్వర్లు నియామకమవగా డైరెక్టర్లుగా తీగల శేఖర్‌రెడ్డి, సిరికొండ లక్ష్మణ్‌ప్రసాద్‌, రమావత్‌ అశోక్‌నాయక్‌, బొడ్డుపల్లి సుందరయ్య, పంగ పుష్ప, అన్వర్‌పాషా, రాచకొండ శ్రవణ్‌, పోలా విశ్వనాథాన్ని నియమించారు.