శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 20, 2020 , 05:30:14

మహిళల సంక్షేమమే సర్కారు ధ్యేయం

మహిళల సంక్షేమమే  సర్కారు ధ్యేయం

పెన్‌పహాడ్‌ / సూర్యాపేట రూరల్‌ :  మహిళల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీ బడుగుల లింగయ్యతో కలసి పెన్‌పహాడ్‌, సూర్యాపేట రూరల్‌ మండలం బాలెంల గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ కానుకగా సారె అందించడం సంతోషకరమన్నారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం రూ. 325కోట్లతో కోటి మంది నిరుపేద ఆడపడుచులకు చీరలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఇంటింటా ఎంతో ఉత్సాహంగా జరుపు కునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామగా, తండ్రిగా సీఎం కేసీఆర్‌ చీరెలు అందించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో 60 ఏండ్ల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం 6ఏండ్ల కాలంలో చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు.  రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాకు రావడంతో సూర్యాపేట జిల్లాలోని  రైతులు సుమారు 40లక్షల 41 వేల ఎకరాలు వరి పంటను సాగు చేశారన్నారు. 4లక్షల41వేల ఎకరాల వరి పంట సాగుతో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే నెంబర్‌-1స్థానంలో నిలిచిందన్నారు. కాంగ్రెసోళ్లకు కలలోకి కూడా రాలేని కల్యాణలక్ష్మి పథకం ప్రవేశ పెట్టుతారని, రైతు బంధు ప్రపంచంలోనే ఎవరూ ఊహించ లేదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికి, రాష్ర్టానికి, ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ నిలువాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. బతుకమ్మ కానుక అందుకని ప్రశాంత వాతావరణంలో భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవా లన్నారు. పెన్‌పహాడ్‌ మండలంలోని 15లబ్ధిదారులకు, బాలెంలో ఒక్కరికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. 

ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్డీవో రాజేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకట నారాయణగౌడ్‌, ఎంపీపీలు నెమ్మాది బిక్షం, బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు మామిడి అనితా అంజయ్య, జీడి భిక్షం, వైస్‌ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, ఎంపీటీసీ ఊరుకొండ రాధాకృష్ణ, సర్పంచ్‌లు చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బిట్టు నాగేశ్వర్‌రావు, షాలీబాయి, రామసాని రమేష్‌నాయుడు, పులగం స్వాతిరాఘవరెడ్డి, నూనావత్‌ విజయమోతీలాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాతాల జానకిరాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, మామిడి అంజయ్య, దొంగరి యుగేందర్‌, మాజీ ఎంపీపీ భూక్యా పద్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, చౌగోని సంతోష్‌, రామసాని శ్రీనివాస్‌, తిరుమళ్‌, రాఘవరెడ్డి, కిరణ్‌, బొబ్బయ్య, రఫి, బొల్లెద్దు వినోద్‌, తహసీల్దార్లు వెంకన్న, శేషగిరిరావు, ఎంపీడీవో వేణుమాధవ్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.