శుక్రవారం 30 అక్టోబర్ 2020
Suryapet - Oct 17, 2020 , 05:58:30

నకిలీ బంగారం అంటగట్టే ముఠా అరెస్ట్‌

నకిలీ బంగారం అంటగట్టే ముఠా అరెస్ట్‌

చౌటుప్పల్‌ :  నకిలీ బంగారం అంటగట్టి మోసం చేస్తున్న ముఠా సభ్యులను చౌటుప్పల్‌ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సీహెచ్‌ వెంకన్న కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన తామిశెట్టి నాగరాజు, మల్లెల సురేశ్‌, అచ్చి కోటేశ్వర్‌రావు, గంజి దుర్గయ్య ముఠాగా ఏర్పడ్డారు. వీరు 2004 నుంచి అమాయకులను నమ్మించి బ్రాస్లెట్లకు బంగారం పూత పూసిన నకిలీ బంగారం అంటగడుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పటికే చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, హుజూర్‌నగర్‌, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల్లో నకిలీ బంగారం అమ్మకాలు చేశారు. వీరిపై సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, తమిళనాడు, గూడూరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో చౌటుప్పల్‌కు  బైక్‌  పొట్ట చంద్రశేఖర్‌ దగ్గరకు ఇటీవల వచ్చారు. పాత ఇండ్లు కూలగొడుతుండగా.. అర కిలో బంగారం దొరికిందని నమ్మించారు. రూ.పది లక్షలకే ఇస్తామని ఆశచూపారు. శాంపిల్‌గా గ్రాము మంచి బంగారాన్ని ఇవ్వగా.. పరీక్షించుకున్న చంద్రశేఖర్‌ మంచి బంగారమే అనే నిర్ధారణకు వచ్చాడు. వారికి లక్షన్నర ముట్టజెప్పి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి బంగారం పూత పూసిన బ్రాస్లెట్‌ను తీసుకున్నాడు. తర్వాత చంద్రశేఖర్‌ దాన్ని పరీక్షించుకోగా నకిలీ బంగారం అని తేలింది. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  దిగిన చౌటుప్పల్‌ పోలీసులు, ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి శుక్రవారం సాయంత్రం చౌటుప్పల్‌ మండలం  టోల్‌ప్లాజా వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.95వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.