బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Oct 16, 2020 , 01:37:32

పంట చేలల్లో నీరు నిల్వకుండా చూడాలి

పంట చేలల్లో నీరు నిల్వకుండా చూడాలి

  •   ఏడీఏ రామారావు 
  • పలు మండలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించిన అధికారులు

ఆత్మకూర్‌.ఎస్‌ : భారీ వర్షాలకు పత్తి, వరి, కంది చేలల్లో చేరిన నీరు నిల్వ ఉండకుండా రైతులు చర్యలు చేపట్టాలని సూర్యాపేట  ఏడీఏ రామారావు సూచించారు. మండలంలోని ఏపూరులో వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటనష్టం జాబితాను సిద్ధం చేయాలని ఏఈఓలకు సూచించారు. కార్యక్రమంలో ఏఓ డి.కృష్ణ, ఏఈ బాబూరావు, ఏఈఓలు కృష్ణమూర్తి, శైలజ పాల్గొన్నారు. 

రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలన

చివ్వెంల : మండల కేంద్రం శివారులోని రైతు  వేదికనిర్మాణ పనులను  ఏడీఏ రామారావు నాయక్‌ గురువారం పరిశీలించి మాట్లాడారు. నాణ్యత లో పించకుండా దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చే యించాలని అధికారులను ఆదేశించారు.  ఆయన వెంట ఏఓ ఆశాకుమారి, ఏఈఓ  పాల్గొన్నారు. 

950ఎకరాల్లో పంట నష్టం అంచనా..

చివ్వెంల: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలో సుమారు 950ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు మండల ఏఓ ఆశాకుమారి తెలిపారు.  మండల కేంద్రంతో పాటు వివిధ గ్రా మాల్లో వర్షాలకు మునిగిన, నెలకొరిగిన పంటలను   ఆమె పరిశీలించారు. 

ఉప్పు నీటిని పిచికారీ చేయాలి

తిరుమలగిరి/ అర్వపల్లి : భారీ వర్షాలకు పత్తి, వరి, కంది చేలల్లో చేరిన వరద నీటిని చేలల్లో నుంచి బయటకు వెళ్లే విధంగా రైతులు చర్యలు చేపట్టాలని తిరుమలగిరి, అర్వపల్లి ఏఓలు వెంకటేశ్వర్లు రేఖల దినాకర్‌ సూచించారు. తిరుమలగిరి మం డలం కన్నారెడ్డికుంటతండా, అర్వపల్లి మం డలం వేల్పుచర్ల గ్రామాల్లో నీట మునిగిన పత్తి, వరి పంటలను  వారు వేర్వేరుగా పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. నేలకొరిగిన వరిని కట్టలు కట్టి ఉప్పునీటిని పిచికారీ చేయాలని సూచించారు.  కార్యక్రమంలో ఏఈఓలు శోభారాణి, నేరెళ్ల సత్యం పాల్గొన్నారు. 

నేలకొరిగిన వరి

తుంగతుర్తి :మండల కేంద్రంతో పాటు మండలంలోని వెంపటి, వెలుగుపల్లి, కర్విరాల, మానాపురం తదితర గ్రామాల్లో నేలకొరిగిన వరి పైరును రైతులు కూలీలను పెట్టి వాటిని సమపర్చారు.  రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని   కోరారు.