శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 15, 2020 , 01:30:24

అంతకుమించి..

అంతకుమించి..

  • గత రికార్డులను చెరిపేసిన సగటు వర్షపాతం
  • ఒక్కరోజే నల్లగొండలో 9.6సెం.మీ. నమోదు
  • అత్యధికంగా తిప్పర్తిలో 16.6సెం.మీ.వర్షం
  • 14మండలాల్లో 10సెంటీ మీటర్లకు పైగా.. 
  • ఈ సీజన్‌లో 37శాతం అదనపు వర్షపాతం

నల్లగొండ : ఒక్కరోజు..  ఉదయం 8నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు అంటే 24 గంటల వర్షపాతం లెక్కలు గత రికార్డులను తారుమారు చేశాయి. అందులో సుమారు 15 గంటలు మాత్రమే వరుణుడు ఉగ్రరూపం చూపించడంతో  స్థాయిలో వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో గరిష్ట వర్షపాతం నమోదు కాగా..  వర్షపాతం 9.6 సెం.మీ.గా రికార్డయింది. అత్యధికంగా తిప్పర్తి మండలంలో 16.6 సెం.మీ. కురువగా.. ఐదు మండలాల్లో 15 సెం.మీ., 14 మండలాల్లో 10 సెం.మీ.లకు పైగా వర్షం కురిసింది.  వ్యాప్తంగా 31 మండలాలకుగాను 27 మండలాల్లో సాధారణానికి మించి నమోదు కాగా, సగటున 37 శాతం అదనపు వర్షపాతం కురిసింది. 

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా  9.6 సెం.మీ.నమోదు..

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో జిల్లాలో  జోరు వర్షం కురిసింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షం పడగా.. మధ్యాహ్నం తర్వాత కుండపోతగా కురిసి సాయంత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. సుమారు 15 గంటలపాటు కురిసిన ఈ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా సగటున 16.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిప్పర్తి మండలంలో 166.9 మి.మీ.(16.6 సెం.మీ) వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ, చిట్యాల, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాల్లో 15 సెం.మీ.కు పైగా..త్రిపురారం, చండూరు, మాడ్గులపల్లి, నిడమనూరు, కట్టంగూరు, నార్కట్‌పల్లి, అనుముల, కనగల్‌, నకిరేకల్‌, దామరచర్ల మండలాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 9.6 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.

27 మండలాల్లో అదనపు వర్షపాతమే..

జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌ ఆసాంతం 27 మండలాల్లో అదనపు వర్షపాతం నమోదు కాగా,  మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు గుండ్లపల్లి, నాంపల్లి, పెద్దవూర, తిరుమలగిరి సాగర్‌ మండలాలు మినహాయిస్తే మిగిలిన 27 మండలాల్లో 20శాతానికి అదనంగా వర్షం కురిసింది. ఈ సీజన్‌లో 580.2 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా.. 794.3 మి.మీ. పడింది. 36.9 శాతం అదనపు వర్షపాతం నమోదైంది.

సూర్యాపేట జిల్లా సగటు 10 సెం.మీ..  

సూర్యాపేట : సూర్యాపేట జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. జిల్లా సగటు  10 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా పాలకవీడు మండలంలో 13 సెం.మీ.  అత్యల్పంగా నేరేడుచర్లలో 5.36 సెంటీమీటర్లు కురిసింది. జిల్లాలోని 23 మండలాల్లో మూడ్రోజుల వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మండలంలె 12.55 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 11.80సెం.మీ., తుంగతుర్తిలో 10.68సెం.మీ., మద్దిరాలలో 10.50సెం.మీ., నూతనకల్‌లో 12.25సెం.మీ., అర్వపల్లిలో 12.47సెం.మీ., సూర్యాపేటలో 11.85సెం.మీ., ఆత్మకూర్‌(ఎస్‌)లో 11.72సెం.మీ., మోతెలో 9.06సెం.మీ., చివ్వెంలలో 6.70సెం.మీ., పెన్‌పహాడ్‌లో 6.97సెం.మీ., మునగాలలో 8.78సెం.మీ., నడిగూడెంలో 7.65సెం.మీ., అనంతగిరిలో 6.62సెం.మీ., కోదాడలో 6.62సెం.మీ., చిలుకూరులో 7.22సెం.మీ., గరిడేపల్లిలో 7.0సెం.మీ., నేరేడుచర్లలో 5.36సెం.మీ., మఠంపల్లిలో 7.47సెం.మీ., హుజూర్‌నగర్‌లో 9.90సెం.మీ., మేళ్లచెర్వులో 10.65సెం.మీ., చింతలపాలెం మండలంలో 12.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

శాంతించిన వరుణుడు

రెండ్రోజులపాటు ఉగ్రరూపం చూపిన వరుణుడు బుధవారం కాస్త శాంతించాడు. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువగా..  బుధవారం తెల్లవారుజాము నుంచి తగ్గిపోయింది. వాతావరణం మబ్బులు కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి.  బుధవారం 2 సెంటీమీటర్ల వర్షం పడగా.. సూర్యాపేట, అనంతగిరి, తుంగతుర్తి, మద్దిరాల, మోతె మండలాలతోపాటు పలు చోట్ల జల్లులు  దీంతో ముంపు ప్రాంతాల్లో  చర్యలు ముమ్మరంగా సాగాయి.