ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Oct 10, 2020 , 06:04:17

అన్నివర్గాల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

అన్నివర్గాల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

  • ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌
  • పార్టీలో పలువురి చేరికలు

తిరుమలగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందుతుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి మున్సిపాలిటీలోని వివిధ పార్టీలకు చెందిన 100మంది ముదిరాజ్‌ సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. 60సంవత్సరాల్లో సాధించని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లోనే సాధించిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్‌, తిరుమలని యాదగిరి, రాము పాల్గొన్నారు.