సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Oct 05, 2020 , 01:11:53

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హుజూర్‌నగర్‌ : 2019 అక్టోబర్‌లో జరిగిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గెలుపును కోరుతూ అక్టోబర్‌ 4న మంత్రి కేటీఆర్‌ హుజూర్‌నగర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఇందిరాసెంటర్‌లో సుమారు రెండు గంటలపాటు కేటీఆర్‌ ప్రసంగించారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డితోపాటు తాను ఉన్న మూడు ఫొటోలను ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘నా గెలుపునకు బాటలు వేసిన రోజు.. హుజూర్‌నగర్‌ ఎన్నిక ప్రచారం కోసం మొదటిసారి  రామన్న నియోజకవర్గానికి వచ్చిన రోజు.. మరోసారి కతజ్ఞతలు కేటీఆర్‌ అన్నా’ అని ఎమ్మెల్యే రాసుకొచ్చారు.  ఎమ్మెల్యే చేసిన పోస్ట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. అత్యంత విజయవంతంగా తొలి సంవత్సరం పూర్తిచేసుకోబోతున్న సైదిరెడ్డికి అభినందనలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారు.