శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Oct 03, 2020 , 01:33:39

వృద్ధుల పట్ల ప్రేమ చూపాలి

వృద్ధుల పట్ల ప్రేమ చూపాలి

  • సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

సూర్యాపేట : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని  జిల్లాలో కరోనా  లోబడి నిర్వహించామని అదనపు కలెక్టర్‌ పద్మజారాణి తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా  వృద్ధుల దినోత్సవం నిర్వహించారు.  సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రేమానురాగాలు పంచాలని సూచించారు.  వయోవృద్ధుల  సంక్షేమం చట్టం 2007లోని అంశాలను, వృద్ధుల హక్కులపై చర్చించినట్లు తెలిపారు.  వయోవృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు, ఐసీడీఎస్‌ పీడీ నర్సింహారావు, మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.