మంగళవారం 20 అక్టోబర్ 2020
Suryapet - Oct 02, 2020 , 01:42:09

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే రహదారులకు మహర్దశ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే రహదారులకు మహర్దశ

  • దోసపహాడ్‌, నాగులపహాడ్‌ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది 
  • రూ.6.23కోట్లతో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన

పెన్‌పహాడ్‌ : గత పాలకుల చేతిలో దగాపడ్డ తెలంగాణ ఎన్నో ఉద్యమాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించింది. సాధించుకున్న రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృతంలో రహదారులకు మహర్దశ కల్పిస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం నుంచి అనంతారం, దోసపహాడ్‌, నాగులపహాడ్‌ గ్రామాలకు వచ్చే అంతర్గత రహదారుల పనులకు పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రూ.6.23కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పాలనలో రహదారులు అధ్వానంగా ఉండేవని, తెలంగాణ రాకతో రహదారులకు మహర్దశ పట్టుకుందన్నారు. ఈ నాలుగు గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నేరవేరబోతున్నట్లు తెలిపారు. మొదటిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గ్రామానికి వచ్చినప్పుడు ఈ రోడ్డును బాగు చేయాలని కోరారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలను సమపాళ్లుగా పరుగులు పెట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

ఈ సందర్భంగా దోసపహాడ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడితోపాటు సుమారు 150మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ నాయకులు దొంగరి యుగంధర్‌, కొండేటి వెంకట్‌రెడ్డి, మేకల శ్రీను ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో దొంగరి విద్యాసాగర్‌, సింగం వెంకన్న, నవీన్‌, గద్దల నాగయ్య, రమేశ్‌, మారయ్య తదితరులు ఉన్నారు. అదేవిధంగా మండలంలోని చిన్నగారకుంటతండాకు చెందిన ధరావత్‌ మిర్యాలి తన వ్యవసాయ పొలం వద్ద డోజర్‌తో పని చేయిస్తుండగా ప్రమాదశాత్తు ఇటీవల మృతి చెందింది. మిర్యాలి టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం కలిగిఉండడంతో పార్టీ తరఫున మంజూరైన రూ.2లక్షల చెక్కును భర్త గోబ్రియాకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు నాతాల జానకీరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, మండాది నగేశ్‌, సర్పంచులు దొంగరి సుధాకర్‌, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాయిలి లక్ష్మి, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, పొదిల నాగార్జున, స్వర్ణ, మామిడి అంజయ్య పాల్గొన్నారు.  

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు..  

సూర్యాపేట రూరల్‌ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాసరబాదలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 7వ వార్డు మెంబర్‌ పూజర్ల కవితతోపాటు 50మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్‌ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, సర్పంచ్‌ కొల్లు రేణుక, ఎంపీటీసీ బంటు నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.logo