శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Oct 01, 2020 , 02:39:58

డివైడర్‌ను ఢీకొట్టి.. ఇంటిపైకి దూసుకెళ్లి

డివైడర్‌ను ఢీకొట్టి.. ఇంటిపైకి దూసుకెళ్లి

  •  ప్రైవేటు బస్సుకు తప్పిన ప్రమాదం.. 
  • నలుగురికి స్వల్పగాయాలు 

కోదాడ రూరల్‌ : రాజస్థాన్‌ నుంచి విశాఖపట్నం  ప్రైవేటు బస్సు డివైడర్‌ను ఢీకొట్టి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ  బుధవారం తెల్లవారుజామున కోదాడ పట్టణ శివారులోని కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్‌డౌన్‌లో స్వస్థలాలకు వెళ్లిన రాజస్థాన్‌కు చెందిన 40 మంది తిరిగి విశాఖపట్నంలోని పనుల్లో చేరేందుకు ప్రైవేటు ట్రావెల్‌  బయలుదేరారు.  తెల్లవారుజామున కోదాడ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది.  ముందు వేప చెట్టును  ఆగిపోయింది. పక్కనే  11కేవీ విద్యుత్‌ స్తంభాన్ని తాకకుండా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా..  చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.