శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Oct 01, 2020 , 02:39:58

రేషన్‌ సరుకులకు కొత్త మార్గదర్శకాలు

రేషన్‌ సరుకులకు  కొత్త మార్గదర్శకాలు

 సూర్యాపేట : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌   నుంచి రేషన్‌ పంపిణీ మూడో వ్యక్తి ప్రమాణీకరణ(వీఆర్వో, వీఆర్‌ఏ)ల ద్వారా కాకుండా కింద పేర్కొన్న సూచనల ద్వారా పంపిణీ చేయాలని సూర్యాపేట అదనపు కలెక్టర్‌ పద్మజారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ తీసుకునేందుకు మూడు ఆప్షన్స్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొదటగా ఓటీపీ ద్వారా రేషన్‌ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. ఇందు కోసం కార్డుదారుడు రేషన్‌కార్డుతో లింక్‌ అయిన మొబైల్‌నెంబర్‌ని రేషన్‌ దుకాణానికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ రేషన్‌కార్డులోని మొబైల్‌ నెంబర్‌ తప్పకుండా ఆధార్‌తో లింకై ఉండాలని ఎవరైనా మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌తో లింక్‌ కాని పక్షంలో దగ్గరలోని ఆధార్‌ సేవ కేంద్రానికి వెళ్లి ఆప్డేట్‌ చేసుకోవాలని సూచించారు. రెండోది ఐరిష్‌ ద్వారా కూడా రేషన్‌ పొందడానికి అవకాశం ఉందని ఇందుకు ఈ పోస్‌ ఇంజినీర్లు, రేషన్‌ డీలర్లు ఐరిష్‌ మిషన్లు సరిగా పని చేసేలా చూసుకోవాలన్నారు. మూడోది బయో మెట్రిక్‌   (ఫింగర్‌ప్రింట్‌) ద్వారా తీసుకునే అవకాశం  ఉన్నట్లు పేర్కొన్నారు.