మంగళవారం 27 అక్టోబర్ 2020
Suryapet - Sep 29, 2020 , 05:24:47

‘నేరాల విచారణను విచారణ వేగవంతం చేయాలి’

‘నేరాల విచారణను విచారణ వేగవంతం చేయాలి’

సూర్యాపేటసిటీ : వివిధ కేసుల్లో నేరాల విచారణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వేగవంతం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పోలీసు అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌ల్లో నమోదవుతున్న కేసులు, కేసుల పురోగతి, నేరాల తీరుతెన్ను, కేసుల దర్యాప్తు విధానంపై ఎస్పీ భాస్కరన్‌ను అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల కేసుల్లో ఉన్న నేరస్తులకు ఎక్కువ మం దికి శిక్షలు పడేలా సూర్యాపేట జిల్లా పోలీసులు  బాగా పని చేశారని డీజీపీ అభినందించారు.  కాన్ఫరెన్స్‌లో డీఎస్పీలు మోహన్‌కుమార్‌  రఘు, సీఐలు,ఎస్‌ఐ, కమ్యూనికేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo