మంగళవారం 27 అక్టోబర్ 2020
Suryapet - Sep 27, 2020 , 01:21:54

మూసీ మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

 మూసీ మూడు గేట్ల ద్వారా   నీటి విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 6870 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు మూడు క్రస్టుగేట్ల ద్వారా దిగువకు 5570 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 50క్యూసెక్కులు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.90 అడుగులుగా(3.91 టీఎంసీలు)ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది.  logo