శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Sep 27, 2020 , 01:22:12

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా చూడాలి 
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నందున  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని శనివారం ఒక ప్రకటనలో  నీటి పారుదల, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, పోలీస్‌, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.  చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులు నివేదికలు పంపాలని ఆదేశించారు.