మంగళవారం 27 అక్టోబర్ 2020
Suryapet - Sep 26, 2020 , 01:39:18

పేటలో భారీ వర్షం

పేటలో భారీ వర్షం

సూర్యాపేట అర్బన్‌ : జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నియోజక వర్గంలోని ఆత్మకూరు (ఎస్‌), చివ్వెంల, సూర్యాపేట రూరల్‌తోపాటు పెన్‌పహడ్‌ మండలంలోని కొన్ని గ్రామాల్లో వర్షం పడింది. సూర్యాపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండగా ఉండి ఒక్కసారిగా మేఘావృతమై గంటకు పైగా వర్షం పడింది. భారీ వర్షంతో పట్టణంలో విద్యుత్‌కు ఆంతరాయం ఏర్పడింది.


logo