గురువారం 22 అక్టోబర్ 2020
Suryapet - Sep 25, 2020 , 01:46:53

చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.15,37,460

చెర్వుగట్టు హుండీ ఆదాయం  రూ.15,37,460

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో  స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీని గురువారం ఆలయ ప్రాంగణంలో సిబ్బంది లెక్కించారు. 85రోజుల్లో రూ.15,37,460 వచ్చినట్లు ఈఓ సులోచన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కమిషనర్‌ మహేంద్రకుమార్‌, సూపరింటెండెంట్‌ తిరుపతిరెడ్డి, పరిశీలకురాలు వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. logo