శుక్రవారం 30 అక్టోబర్ 2020
Suryapet - Sep 25, 2020 , 01:29:01

రేషన్‌ డీలర్లు వివరాలు నమోదు చేసుకోవాలి : తాసిల్దార్‌

రేషన్‌ డీలర్లు వివరాలు నమోదు చేసుకోవాలి : తాసిల్దార్‌

చందంపేట : మండలంలోని వివిధ గ్రామాల రేషన్‌డీలర్లు తమ వివరాలను నమోదు చేయించుకోవాలని తాసిల్దార్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. డీలర్ల ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, ఆథరైజేషన్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలతో పాటు ఇద్దరు నామినీల వివరాలను కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఖాళీ బస్తాలను దేవరకొండ గోదాములో అందించి రసీదు పొందాలన్నారు.