గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Sep 24, 2020 , 06:49:57

102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మిర్యాలగూడ రూరల్‌  నల్లగొండ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల పోలీసులు 102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ  పరమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం  చెందిన ధనావత్‌ శ్రీను, దామరచర్ల మండలం తుమ్మచెట్టు తండాకు చెందిన బొలేరో వాహనం యజమాని  కలిసి మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి పీడీఎస్‌ బియ్యం సేకరించి కుంటకిందితండాలో నిల్వ చేశారు. 130  (70 క్వింటాళ్ల) బియ్యాన్ని బుధవారం బొలేరోలో లోడ్‌ చేస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.  సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐతెలిపారు. 

చందంపేట : బొలేరోలో  24 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని గుంటిపల్లి స్టేజీ వద్ద బుధవారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. పోలేపల్లి నుంచి డిండికి వెళ్తున్న బొలేరో వాహనంలో బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని  గోదాంకు తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు. 

దేవరకొండ  దేవరకొండ నుంచి  తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పాషా అనే వ్యక్తి దేవరకొండలో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి తరలిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.